ప్రపంచంలోనే తొలి రోబో మాల్ (Robot Mall)చైనాలో ప్రారంభం: భవిష్యత్తు ఇప్పుడు అందుబాటులో ఉంది!
సాధారణంగా మనం మొబైల్స్ కోసం మొబైల్ షాపులకో, ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం ప్రత్యేక దుకాణాలకో వెళ్తాం. బట్టలు, ఆభరణాలు, వాహనాలు, నిత్యావసరాలు – ఇలా ప్రతి వస్తువుకూ ప్రత్యేక షోరూమ్‌లు ఉంటాయి. కానీ, ప్రపంచాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తున్న రోబోల కోసం ఇప్పటివరకు అలాంటి ప్రత్యేకమైన మాల్ అంటూ ఏదీ లేదు. అయితే, రోబోల పరిశోధన మరియు తయారీల్లో గ్లోబల్ లీడర్‌గా మారిన చైనా, ఇప్పుడు అలాంటి ఒక భారీ మాల్(Robot Mall)ను ఏర్పాటు చేసింది.
ప్రపంచంలోనే తొలిసారిగా, రోబోలను మాత్రమే విక్రయించే ఒక ప్రత్యేకమైన మాల్ బీజింగ్‌లో ప్రారంభమైంది. ఇది కేవలం రోబోలను అమ్మడం మాత్రమే కాదు, వాటికి సంబంధించిన అన్ని సర్వీసులు, స్పేర్ పార్ట్‌లు, రోబోల కొనుగోళ్లకు లేదా లీజులకు ఫైనాన్స్, ఇన్సూరెన్స్, లోన్లు వంటివి కూడా ఇక్కడే పొందవచ్చు. ఈ మాల్, రోబోల పరిశోధన సంస్థలకు మరియు వినియోగదారులకు మధ్య ఒక సంధాన సేతువుగా పనిచేస్తుంది. ఈ ప్రత్యేకమైన మాల్ పేరు హ్యూమనాయిడ్ రోబోట్ ఫోరెస్ట్ షాప్.
ఈ మాల్ Robot Mall ఎంత పెద్దదంటే:
• భవనంలోని నాలుగు అంతస్తుల్లో 100కు పైగా రకాల రోబోలను విక్రయిస్తున్నారు.
• ఇక్కడ సుమారు 200 వరకు రోబో తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.
• ఈ మాల్‌లో రోబోల ధరలు 24,000 రూపాయల నుండి 85 లక్షల రూపాయల వరకు ఉన్నాయి.
Robot Mallమీరు ఇక్కడ ఎలాంటి రోబోలను కొనుక్కోవచ్చంటే:
• సంగీతాన్ని అద్భుతంగా వాయించే రోబోలు మరియు రోబో మ్యూజిక్ బ్యాండ్‌లు.
• ఇంట్లో వంట చేసి పెట్టే లేదా కాఫీ తయారుచేసే మరమనుషులు.
• రోబో జాగిలాలు, డాన్స్ చేసే రోబోలు.
• ప్రముఖుల ముఖాలతో కూడిన మరబొమ్మలు.
• అలెక్సా, సిరి మాదిరిగా వాయిస్ సేవలను అందించే రోబోలు.
• ఫ్యాక్టరీలలో మనుషులకు హాని కలిగించే ప్రమాదకర వస్తువులను మోయించే మూవర్స్ రోబోలు.
• మెడికల్ షాపులు, కిరాణా షాపుల్లో ఔషధాలు లేదా ఇతర వస్తువులను స్కాన్ చేసి కస్టమర్లకు అందించే రోబోలు.
• బార్లలో ఆల్కహాల్‌ను సర్వ్ చేసే రోబోలు.
చైనా రోబో పరిశ్రమలో అగ్రగామి: ప్రపంచ రోబో పరిశ్రమలో చైనా అగ్రస్థానంలో ఉంది. హ్యూమనాయిడ్ రోబోల అమ్మకాలను అక్కడి ప్రభుత్వమే స్వయంగా ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయంగా అత్యాధునిక రోబోలను రూపొందించే లక్ష్యంతో చైనా నిరంతరం పని చేస్తోంది. ఈ రోబో మాల్, చైనా రోబోటిక్స్ రంగంలో ఎంత ముందుందో తెలియజేస్తుంది. భవిష్యత్తులో రోబోలు మన దైనందిన జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషించనున్నాయో ఈ మాల్ ఒక సూచనగా నిలుస్తుంది.








